dharani portal services

రాష్ట్ర వ్యాప్తంగా ’ధరణి‘ సేవలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సిఎస్ సోమేశ్ కుమార్ ’ధరణి‘ సేవలను ప్రారంభించారు. రెవెన్యూ శాఖలో నూతన సంస్కరణలు తీసుకొస్తూ ’ధరణి‘ వెబ్ పోర్టల్ ను ఇటీవల సిఎం కెసిఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ’ధరణి‘ సేవల ప్రక్రియను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సిఎస్ సోమేశ్ కుమార్ కు వివరించారు. అయితే ప్రస్తుతం వ్యవసాయ భూ ముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మాత్రమే జరుగనున్నాయి. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో ’ధరణి‘ సేవలు రైతులకు అందుబాటులోకి వచ్చాయని సిఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 1.48 లక్షల ఎకరాలకు సంబంధించి 59.46 లక్షల ఖాతాలు ’ధరణి‘లో పొందుపర్చామని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్ర‌క్రియ ఏకకాలంలో కొన‌సాగుతుంద‌న్నారు. సోమవారం 946 మంది రిజిస్ర్టేష‌న్ల కోసం న‌గ‌దు చెల్లించారని, 888 మంది స్లాట్ బుక్ చేసుకున్నార‌ని ఆయన వెల్లడించారు.

Dharani Services Begins In Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *