ap

తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యాపారం చేయడానికి అత్యంత అనువైన రాష్ట్రాల జాబితాను విడుదల చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 (సులభ వ్యాపార నిర్వహణ) ర్యాంకింగ్స్‌లో ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి పీయూష్ గోయల్, కేబినెట్ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ర్యాంకింగ్స్‌ను విడుదల చేశారు.

Andhra Pradesh likely to have 25 districts, process of delimitation commences

వ్యాపారపరమైన సంస్కరణల అమలు ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకింగ్స్‌ను ఇచ్చింది. ఏక గవాక్ష విధానం, కార్మిక సంస్కరణలు, వివాదాల పరిష్కార చట్టంలో సంస్కరణలు ఇలా పలు కీలక నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తోందని పీయూష్ గోయల్ తెలిపారు.