eluru mystery disease

ఏలూరులో వింత వ్యాధి ఓ మిస్టరీలా మారింది. రెండు, మూడు రోజులుగా డాక్టర్లు, నిపుణులు కారణాలను కనిపెట్టే పనిలో ఉన్నారు. నీరు కలుషితమవడమే అంతు చిక్కని వ్యాధి ప్రబలేందుకు ముఖ్య కారణమని వైద్య వర్గాలు స్థూలంగా ఓ అవగాహనకు వచ్చాయి. ముఖ్యంగా ఏలూరులో పంపుల చెరువు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. మంచినీరు వారం క్రితం పసుపు రంగులో వచ్చాయని స్థానికులు చెప్పడంతో ఎన్‌సీడీసీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ, ఐసీఎంఆర్‌, ఢిల్లీ ఎయిమ్స్‌ ప్రతినిధులు దీనిపై ముఖ్యంగా ఫోకస్ పెట్టారు. పంపుల చెరువుకు పక్కపక్కనే ఉన్న ప్రాంతాల నుంచి మాత్రమే కేసులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంట్లో నలుగురైదుగురు సభ్యులు ఉంటే ఒకరిద్దరే వ్యాధి బారినపడటంపై దృష్టిపెట్టారు. పశువుల మెడ, కోడి రెక్కల కింద నుంచి, గేదెలు, ఇతర వాటి నుంచి సేకరించిన నమూనాలను లక్నో, భోపాల్‌కు పంపించారు.

నీటిలో ఆర్గానో క్లోరిన్‌ చేరడంతో ఈ వింత వ్యాధి ప్రబలినట్లు భావిస్తున్నట్లు పలు సంస్థలు ప్రాథమికంగా చెబుతున్నాయి. ఆర్గ్గానో క్లోరిన్‌ గ్రూపులో చాలా సమ్మేళనాలు ఉన్నాయని.. గతంలో రంగులు వేసేటప్పుడు, వాటిని తొలగించేటప్పుడు దీనిని ఉపయోగించేవారు. కానీ కొన్నేళ్లుగా అధికారికంగా దీనిని వాడటం లేదు. మరి నీటిలో ఇదెలా చేరిందో తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఎన్‌ఐఎన్‌, మంగళగిరి ఎయిమ్స్‌ వర్గాలు మాత్రం నీరు కలుషితమవటం వల్లనే వ్యాధి ప్రబలినట్లు స్పష్టంగా చెబుతున్నాయి. బాధితుల మూత్రంలో సీసం లేదని ఢిల్లీ ఎయిమ్స్‌ నుంచి సమాచారం అందింది. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన కేసుల్లో వ్యాధి లక్షణాలు తగ్గాయి. ముందు బాధితులు చేతులు, కాళ్లను గట్టిగా కొట్టుకోవడం వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారు. గురువారం వచ్చిన బాధితులు తల తిరుగుతుందని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. శరీరంలో చేరిన కలుషితాల ప్రభావం నిదానంగా తగ్గుతున్నందువల్లే లక్షణాలు తగ్గుముఖం పట్టాయి అంటున్నారు.

Eluru mystery disease: AIIMS finds traces of lead in blood samples of  affected | Cities News,The Indian Express

ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థులవడానికి గత నెలలో వచ్చిన వరదలే కారణమై ఉండొచ్చని ఐఐసీటీ శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భారీ వర్షాలకు పొలాల మీదుగా వరదలు రావడం, ఆ నీరు కాలువలు, పైపుల్లో చేరడంతో క్రిమిసంహారక మందుల అవశేషాలతో కలుషితమై ఉంటాయని భావిస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన నమూనాలను హైదరాబాద్‌లోని ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌ఐఎన్‌లలో రెండు రోజులుగా పరీక్షిస్తున్నారు. శుక్రవారానికి ప్రాథమిక నివేదిక రానుందని ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త జె.జె.బాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *