Free Covid Vaccine

Free Covid Vaccine  : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. మే 1 నుంచి దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల మధ్య వారు సుమారు 2,04,70,364 మంది ఉన్నారు. వీరందరికి ఏపీ సర్కార్‌ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వనుంది.

ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడిపై సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన విస్తృతంగా చర్చించాము. ప్రజల భాగస్వామ్యంతో పాటు వాక్సినేషన్ ముఖ్యమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తున్నాం. 18-45 వయసు ఉన్న వారికి ఉచితంగా టీకా వేస్తాం. ఇందుకు గాను 1600 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాం. అలానే కరోనా కట్టడి కోసం రేపటి నుంచి రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది’’ అని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *