GHMC Elections 2020

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలకు నగారా మోగింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను దాంతోపాటు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 1న ఓటింగ్‌ నిర్వహించి, డిసెంబర్‌ 4 న కౌంటింగ్‌ చేపడుతామని తెలిపారు. డిసెంబర్‌ 3న అవసరమైతే రీ పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. రేపటి నుంచి డివిజన్ల వారీగా నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపారు. నవంబర్‌ 20 నామినేష్ల దాఖలుకు చివరి తేదీ అని, నవంబర్‌ 21 న నామినేషన్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. నవంబర్‌ 22న నామినేష్ల ఉపసంహరణకు చివరి తేదీ అని ఎస్‌ఈసీ తెలిపారు. డిసెంబర్‌ 6 లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. మొత్తం 14 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరుగుతాయని పార్థసారథి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ చట్ట ప్రకారమే 150 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు.

The State Election Commission Is Preparing To Conduct GHMC Elections

గ్రేటర్‌ ఎన్నికలు-మరిన్ని వివరాలు
⇒ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌
⇒ మధ్యాహ్నం 12 గంటలకల్లా బ్యాలెట్‌ పేపర్లు సెపరేటు
⇒ మధ్యాహ్నం 3 గంటలకల్లా ఫలితాలు
⇒ ఎస్సీ, బీసీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2500 నామినేషన్‌ డిపాజిట్‌
⇒ రిటర్నింగ్‌ అధికారి దగ్గరకు వచ్చే నామినేషన్లు దాఖలు చేయాలి
⇒ ప్రస్తుతం 9,238 పోలింగ్‌ కేంద్రాలు
⇒ తెలుగు రంగు బ్యాలెట్‌ పేపర్‌ వినియోగం
⇒ గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *