how to wear face mask

ఫేస్‌మాస్క్‌ను ఎలా ధరించాలి అనే దానిపై అవగాహన కల్పించడానికి ప్రశంసలు పొందిన ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒక ప్రత్యేక కళాకృతిని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. అయితే వైరస్ నుంచి సురక్షితంగా మనల్ని మనం కాపాడుకోవడంతో ఫేస్ మాస్క్ ఎంతో ఉపయోగపడుతోంది. కానీ కొందరు దీన్ని సరిగా పెట్టుకోవడం లేదు. మాస్క్‌ను సరిగ్గా ధరించకుండా వైరస్ బారిన పడుతున్నారు. మాస్క్ నోటితోపాటు ముక్కును కూడా సరిగ్గా కప్పేలా మాస్క్ ధరించాలంటూ ఇప్పటికే డాక్టర్లు, నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇదే విషయాన్ని శాండ్ ఆర్ట్ ద్వారా అద్భుతంగా తెలిపాడు సుదర్శన్ పట్నాయక్.

ఒడిశాలోని పూరి బీచ్‌లో శాండ్ ఆర్ట్‌ పట్నాయక్ తన కళాకృతులతో ఫేస్‌మాస్క్ ధరించడంపై ఈ చిత్రాన్ని రూపొందించాడు. మాస్క్‌ను సరిగా తొడగండి.. కరోనాపై పోరాడండి అన్న క్యాప్షన్ కూడా ఇచ్చాడు. తన ట్విటర్‌లో కూడా షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.