importance of rakhi bandhan

సోదర, సోదరీ బంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ దేశవ్యాప్తంగా సాదాసీదాగా జరుగుతోంది. కరోనా వైరస్ ఉంది కాబట్టి… ఎక్కువ హడావుడి లేకుండా… నిరాడంబరంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతల వరకూ అందరూ రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ సోదరులపై రాఖీ కట్టి ప్రేమను చాటుతున్నారు.

 ప్రతి సంవత్సరం... దాదాపు 50 కోట్ల రాఖీలు ఇండియాలో అమ్ముడవుతాయి. దాదాపు రూ.6000 కోట్ల రాఖీల బిజినెస్ జరుగుతుంది. కొన్నేళ్లుగా వాటిలో రూ.4000 కోట్ల బిజినెస్ చైనాదే ఉంటోంది. (credit - twitter)

రక్షాబంధన్ విశిష్టత

శ్రావణ పూర్ణిమనే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు. వాస్తవానికి భారతదేశంలో రాఖీపౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు. కానీ, పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి. వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శచీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడిచేతి మణికట్టుకి కట్టింది. దీంతో ఆయన రాక్షసులను ఓడించి, విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతారు.

Raksha Bandhan 2020: Do not tie this types of Rakhi on your brothers hand  considered as Inauspicious

మహాభారతంలో ద్రౌపది, శ్రీకృష్ణుల అన్నాచెల్లెళ్ల అనుబంధం గొప్పది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది. అక్కడే ఉన్న సత్యభామ, రుక్మిణి మొదలైనవారు కంగారుపడి గాయానికి మందుపూయడానికి తలో దిక్కున వెళ్లి వెదుకుతుంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టు కట్టింది. దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు.