Independence day celebrations

ఏపీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణ వాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్నారు జగన్. కడప పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆదిములపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ఇంచార్జ్ మంత్రి , డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎస్పీ అన్బురాజన్, ఇతర అధికారులు.

Also Read: ఐసీయూలో ఎస్పీ బాలు ఫోటో వైరల్