jangareddygudem rohith cell tower

పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెంకు చెందిన రోహిత్ అనే యువకుడు తానూ ప్రేమించిన అమ్మాయి కోసం సెల్‌టవర్‌ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ.. రాత్రింత అక్కడే కూర్చున్నాడు. బుధవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.

Lover who climbs cell tower for his girlfriend

అమ్మాయి వస్తేనే కిందకు దిగుతానంటూ సెల్ టవర్ పైనే కూర్చోని ఆందోళన చేస్తూ పోలీసులను, స్థానికులను టెన్షన్‌కు గురిచేశాడు. పోలీసులు కల్పించుకుని మాట్లాడేందుకు కిందకు రావాలని రోహిత్ ను ఇన్‌ఛార్జి సీఐ మల్లేశ్వరరావు పిలిచారు. అ మేరకు రోహుత్ టవర్ నుంచి కిందకు వస్తున్న సమయంలో తేనెటీగలు చెలరేగాయి. అక్కడే ఉన్న పోలీసులు, మీడియా సిబ్బందిని తేనెటీగాలు కుట్టాయి. వాటి నుంచి తప్పించుకున్నేందకు బాధితుడు పక్కనే ఉన్న కల్యాణమండపంలోకి దూకేశాడు. తేనేటీగాల భయంలో పోలీసులు, మీడియా సిబ్బంది పరుగులు తీశారు. గాయాలపాలైన యువకుడిని జంగారెడ్డి దవాఖానకు తరలించి వైద్యపరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు.