kalvakuntla kavitha

రాజకీయ, సామాజిక వ్యవహార శైలి పరంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, తాజాగా ట్విట్టర్ లోనూ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ట్విట్టర్ లో ఒక మిలియన్ ఫాలోవర్స్ పొందిన దక్షిణ భారతదేశ తొలి మహిళా రాజకీయ నాయకురాలిగా నిలిచారు.ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు ఇంత పెద్దఎత్తున ఫాలోవర్లను పొందడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి కూడా మాజీ ఎంపీ కవితకు ట్విట్టర్ లో ఫాలోవర్లు ఉన్నారు. దశాబ్దకాలం క్రితం 2010 సంవత్సరంలో మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించారు.

Image

 

ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన మహిళా నాయకురాలిగా, పరిమితులను అధిగమించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్లను సాధించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మాజీ ఎంపీ కవిత తర్వాత దక్షిణాది నుంచి అత్యధిక ఫాలోవర్స్ కలిగిన మహిళా నేతలలో డీఎంకే ఎంపీ కనిమొళి, తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్, బీజేపీ ఎంపీ శోభ తదితరులు ఉన్నారు.