Maoist warning letter

మావోయిస్టులు మరోసారి కలకలం రేపారు. తాజాగా లేఖలు ద్వారా పలు హెచ్చరికలు జారీ చేశారు. ఏటూరునాగారం, భూపాలపల్లి ఏరియా కమిటి, ఉంగా పేరుతో గోడ పత్రికలు అంటించారు. షాపల్లి గ్రామంలో మావోల పేరుతో గోడలకు అంటించిన వాల్ పోస్టర్లు.‌.. ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతకు పోలీసు బలగాలతో అడవులను జల్లడ పట్టడం ఆపాలన్నారు. కూంబింగ్స్ ఆపకుంటే టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు భీమేశ్వర రావుకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

అంతేకాదు మాజీ మావోయిస్టు ముద్రబోయిన సంపత్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు. అతడు తన బొలేరో వాహనంలో పోలీసులను తిప్పడం పద్ధతి కాదన్నారు. ప్రజల చేతులో శిక్ష తప్పదని హెచ్చరించారు మావోలు. ఫారెస్ట్ అధికారులు డీఆర్వో ప్రహ్లాద్, రవిందర్, సందీప్ లు ఇంకా చాలా మంది పద్ధతి మార్చుకోవాలని మావోల లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదన్నారు. ప్రజలు సమస్యలు అడిగితె అక్రమ అరెస్టులు చేయిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పెంచతూ ప్రజల పై అక్రమ కేసులు పెడుతూ బలి చేస్తున్న కేసీఆర్…అంటూ లేఖలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *