Miss Universe

Miss Universe : మెక్సికో భామ ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యారు. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో గెలుపొంది విశ్వ సుందరి కిరీటం సొంతం చేసుకున్నారు. తొలి రన్నరప్‌గా మిస్‌ బ్రెజిల్‌ జులియా గామా, రెండో రన్నరప్‌గా మిస్‌ పెరూ జానిక్‌ మెసెటా డెల్‌ కాసిలో నిలిచారు. మిస్‌ ఇండియా అడెలిన్‌ కాస్టెలినో సైతం గట్టిపోటీనిచ్చి టాప్‌-5లో స్థానం సంపాదించుకున్నారు.

Miss Universe

మిస్‌ యూనివర్స్‌ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. 26 ఏళ్ల ఆండ్రియా మెజా.. మెక్సికోని చిహువాకు చెందినవారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. మోడలింగ్‌పై ఆసక్తి గల ఆమె.. చిహువా టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

Miss Universe

 

అంతేగాకుండా, మహిళా హక్కులపై ఉద్యమిస్తూ.. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు. ఇక సర్టిఫైడ్‌ మేకప్‌ ఆర్టిస్టు మోడల్‌ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని ఆమె.. వీగన్‌గా మారిపోయారు. పూర్తి శాకాహారమే తీసుకుంటున్నారు. కాగా మెక్సికో నుంచి మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైన మూడో మహిళగా ఆండ్రియా నిలిచారు. అంతకు ముందు లుపితా జోన్స్‌(1991), షిమెనా నవరటె(2010) ఈ విశ్వ సుందరీమణులుగా నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *