mla roja fires on media

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజాకు కోపం వచ్చింది. ఆమె జబర్దస్త్ షోలో వేసుకునే డ్రెస్సులపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ఆమె తన చేతిలో ఉన్న పేపర్‌ని విసిరికొట్టింది. ఇలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారు? మీడియా అంటే తనకెంతో గౌరవం ఉంది.. కాని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు’ అంటూ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి కి లేని అభ్యంతరం మీకెందుకు?? ఒక వేళ జబర్దస్త్‌నా? రాజకీయమా అంటే?? నా ప్రయాణం రాజకీయాలవైపే అంటూ వివరణ ఇచ్చారు రోజా.నాకు వేరే వ్యాపారాలు, ఆస్తులు లేవు. నాకు సినిమాలు, రాజకీయాలు రెండు కళ్లలాంటివి. నాకు నా ప్రొఫెషన్ వుంది. సినిమా ఆర్టిస్ట్‌గా ఉంచి ప్రజల అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చాను. గతంలో సీఎం అయిన ఎన్టీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక కూడా డాన్స్‌లు చేయలేదా?? అంతెందుకు బాలయ్య గారు ఈరోజుకీ సినిమాల్లో నటిస్తున్నారు.. డాన్స్‌లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేసి ఆయనా డాన్స్‌లు చేస్తున్నారు. వాళ్లకో రూలు నాకో రూల్. ఏంటిది అంటూ ఒకరేంజ్ లో తన ప్రతాపం చూపించారు రోజా.

Visuals can be deceiving: Jabardasth judge Roja reacts on the arrest of  Dorababu and Paradesi in connection with a sex racket - Times of India

actress Roja gives a "sweet warning" to Jabardasth contestant!

జబర్దస్త్ రోజా మిస్సింగ్.. వెల్లువెత్తుతున్న అనుమానాలు! అసలేం జరుగుతోంది..?  | Roja missed in Jabardasth latest Show.. The Reason? - Telugu Filmibeat

నేను మంచి డాన్సర్‌ ని.. నన్ను ఎంతో అభిమానిస్తారు కాబట్టి.. నేను డాన్స్ చేస్తా. అయినా రెండో సారి ఎమ్మెల్యే అయిన తరువాత లిమిట్ చేసి.. చైర్‌లోనే డాన్స్ చేస్తున్నాం తప్ప కిందికి దిగడం లేదు. వీళ్లతో అనవసరంగా అనిపించుకోవడం ఎందుకు అని నేను డాన్స్ కూడా తగ్గించేశా అంత మాత్రాన మీరు అలాంటి ప్రశ్నలు వేస్తారా అని ఆమె మండిపడ్డారు. ఇండస్ట్రీ, పాలిటిక్స్ రెండూ రెండు కళ్లు లాంటివి. ఏ ఒక్కటీ వదలుకోను. రాజకీయాల్లో ఖర్చుపెట్టడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల మళ్లీ యాక్ట్ చేయాల్సి వచ్చింది. నా మానసిక సంతృప్తి కోసం కూడా నేను యాక్ట్ చేయాల్సి వచ్చింది. పాలిటిక్స్‌లో ఉన్న ఒత్తిడి నుంచి కోలుకోవడానికి జబర్దస్త్ మళ్లీ చేశానన్నారు.