Monkey in marraige

కరోనా కాలంలో ఎంతటి వారి పెళ్లిళ్లలోనైనా అతిథులే కరువయ్యారు. ఈ సమయంలో ఓ వానరం తానే విశిష్ట అతిథి అయ్యింది.తాజాగా పెళ్లి చేసుకుంటున్న ఓ జంటకు కోతి షాక్ ఇచ్చింది. తలంబ్రాలు పోసుకుంటున్న వేళ వానరం ప్రత్యక్షమై వధూవరులను ఆశీర్వదించింది.ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఎక్కడ నుంచి వచ్చిందో, ఎటు నుంచి వచ్చిందో తెలియదు కాని.. నూతన జంట తలంబ్రాల సందర్భంలో తాను చెయ్యి కలిపి మనసార ఆశీర్వదించింది. ఈ అరుదైన సంఘటన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం కు చెందిన వారు మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చోటు చేసుకుంది. అయితే ఈ అద్భుతం చూసిన అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే బంధువులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేశారు.