nutan naidu police case

రాష్ట్రంలో దళితుల మీద దాడులు ఆగడం లేదు. విశాఖ నగర పరిధిలోని సుజాతానగర్‌లో ఉన్న సినీ నిర్మాత నూతన్‌కుమార్‌నాయుడు ఇంట్లో శుక్రవారం ఓ దళిత యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన సంచలనం రేపింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్‌కుమార్‌ నాయుడు భార్య మధుప్రియ దళిత యువకుడు కర్రి శ్రీకాంత్‌ కు శిరోముండనం చేయించారని ఫిర్యాదు అందింది. తనకు జరిగిన అవమానంపై బాధితుడు పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్‌ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ విభాగం ఏసీపీ త్రినా«థ్‌ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు. అతడి వాంగ్మూలం మేరకు నిందితురాలు మధుప్రియ సహా నలుగురిని జరిగిన ఘటనపై విచారిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు సాగుతోందని విశాఖ సీపీ మనీష్‌కుమార్‌ సిన్హా తెలిపారు. ఘటనను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ చెప్పారు.

Also Read: ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. .