pranab mukerjee

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ రాష్ర్ట‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి కూడా క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ట్వీట్ చేశారు. వేరే స‌మ‌స్య వ‌ల్ల ఆస్ప‌త్రికి వెళ్లిన‌ప్పుడు.. త‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌లో త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. గ‌త వారం రోజుల నుంచి త‌న‌ను ఎవ‌రైతే క‌లిశారో.. వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాలి అని మాజీ రాష్ర్ట‌ప‌తి విజ్ఞ‌ప్తి చేశారు. కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకున్న త‌ర్వాత స్వీయ నియంత్ర‌ణ పాటించాల‌ని ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోరారు. మరోవైపు దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో 22లక్షల 15 వేల 074 కేసులు.. మరణాల సంఖ్య 44,466వ‌రుస‌గా నాలుగో రోజు 62 వేల‌కు పైగా పాజిటివ్ కేసుల‌తోపాటు, ఎనిమిది వంద‌ల‌కు పైగా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. తాజాగా రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాలు 44 వేలు దాటాయి.

Source : newsting

Former President of India Pranab Mukherjee tests positive for COVID-19 - OrissaPOST

దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 1,007 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. ఇంత‌పెద్ద సంఖ్య‌లో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టి సారి. అదేవిధంగా నిన్న ఉద‌యం నుంచి ఈరోజు ఉద‌యం వ‌ర‌కు 62,064 మంది కొత్త‌గా క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 22,15,075కు పెర‌గ‌గా, మ‌ర‌ణాలు 44,386కు చేరాయి. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 6,34,945 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 15,35,744 మంది బాధితులు కోలుకున్నారు.