problems in online classes

కరోనా విద్యార్థులకు కష్టాలను తెచ్చిపెట్టింది. ఆడుతూ పాడుతూ తోటి మిత్రులతో కలిసి పాఠశాలలో గడుపుతూ చదువుకునే అవకాశం లేకుండా చేసింది. అయితే ప్రభుత్వం విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్ లైన్ తరగతులను ప్రారంభించింది.దూరదర్శన్, టిశాట్ ద్వారా తరగతులను బోధిస్తున్నారు. అయితే ఇప్పుడు అదె మరింత కష్టంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో విద్యుత్ కోత ఒక సమస్య అయితే కొందరి వద్ద స్మార్ట్ ఫోన్ లేక, మరికొందరు స్మార్ట్ ఫోన్ ఉన్నా సిగ్నల్ లేక ఆన్ లైన్ తరగతులను వినలేకపోతున్నారు.సెల్ సిగ్నల్ కోసం చెట్ల వెంట, గుట్టల వెంట పరుగెత్తాల్సి వస్తోంది. ఇదిలా ఉంటె నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలోని ఓ విద్యార్థిని చేనులోని మంచె పై కూర్చోని చదువుకుంటోంది. గ్రామంలో ఎన్నో రోజుల నుండి సెల్ టవర్ పనిచెయ్యడం లేదు.

 కాగా వ్యవసాయం చేసుకొని జీవనోపాధి పొందుతున్న తాను ప్రతి రోజు ఊరి చివర ఉన్న మొక్కజొన్న తోట వద్దకు కూతురును తీసుకువెళ్ళి, తరగతులు అయిపోయే వరకు కాపాలా ఉండి తరగతులు ముగిసిన తర్వాత తీసుకు వస్తున్నానని షేక్ శాకీర్ పేర్కొన్నారు. తమ ఊరికి సెల్ సిగ్నల్ అందేలా చూడాలని కోరారు.

 కలెక్టర్, మంత్రి చొరవ తీసుకొని గ్రామానికి సెల్ సిగ్నల్ వచ్చేలా చేసి విద్యార్థుల ఇబ్బందులను దూరం చేయాలని కోరుతోంది.

అయితే నిర్మల్‌లో మైనారిటి గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న రాజూరా గ్రామానికి చెందిన సాఫా జరీనా అనే విద్యార్థిని ఇంటి దగ్గర ఫోన్ సిగ్నల్ రావడం లేదని ఊరు చివర సుమారు రెండు కిలోమిటర్ల దూరంలో ఉన్న మొక్క జొన్న తోటలో మంచె పైన కూర్చొని తరగతులను వింటోంది. మంచెపై కూర్చుంటేనె సెల్ సిగ్నల్ వస్తోంది.ఇందుకోసం ప్రతి రోజూ తన తండ్రిని తీసుకొని మొక్క జొన్న తోటకు వచ్చి మంచెపైన కూర్చొని ఆన్ లైన్ తరగతులను వింటోంది. ఊళ్లో సెల్ టవర్ సిగ్నల్ లేక ఆన్లైన్ క్లాస్లులకు ఇబ్బంది పడుతున్నమని విద్యార్థిని సాఫా జరీనా చెబుతోంది.(Source: News18Telugu)