sarkar vaari pata motion poster released

Mahesh Babu's SSMB7 Sarkaru Vaari Paata First Look

సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ మూవీ సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన మోస్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు.