scrub typhus in vizag

ఏపీలో కరోనా మహమ్మారి దెబ్బకు ప్రజలు వణికిపోతుంటే.. విశాఖను మరో కొత్త వైరస్ భయపెడుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తరిస్తోందట. ఈ వైరస్ దెబ్బకు ఆందోళనలో ఉన్నారు. ఈ వైరస్ లక్షణాల్లో కూడా జ్వరం ఉండటంతో జనాలు వణికిపోతున్నారు.విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో స్క్రబ్ టైఫస్ అనే వైరస్ విస్తరిస్తోందట. మురుగు నీరు నిల్వ ఉన్న చోట, పచ్చిక ఎక్కువుగా ఉన్న ప్రాంతాలలో ఈ పురుగు ఉంటుంది. స్క్రబ్ టైఫస్ మనిషి మీద దాడి చేస్తే మొదట శరీరం మీద దద్దుర్లు వస్తున్నాయి. తర్వాత జ్వరం రావడం ప్రధాన లక్షణం. ఒకవేళ జ్వరం ఎక్కువైనా వైరస్‌ను గుర్తించడం ఆలస్యమైనా మనిషి శరీరంలో మూత్రపిండాలు, గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే ఇది కరోనా మాదిరి తీవ్రమైన వైరస్ కాదని.. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం కూడా లేదని డాక్టర్లు అంటున్నారు.

Scrub Typhus - Two Died In Rohtak, 28 Patients Caught

విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ముగ్గురు ఇలాగే చనిపోయారట. మొదట వీరికి జ్వరం రావడంతో కరోనా అనుకున్నారు. టెస్టులు నిర్వహిస్తే నెగటివ్ వచ్చింది. తర్వాత మలేరియా, డెంగ్యూలకు కూడా నెగటివ్ వచ్చింది. తర్వాత కొందరు నిపుణులు అధ్యయనం చేస్తే స్క్రబ్ టైఫస్ అని తేలిందట. ఈ వైరస్‌ను ముందుగానే గుర్తిస్తే యాంటీ బయోటిక్ ఇంజక్షన్‌తో నయం చేయవచ్చునని.. ఆలస్యమైతే మాత్రం దీని ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటుందని డాక్టర్లు అంటున్నారు.