SP Balasubrahmanyam

ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. ఈయన మరణవార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. కోట్లాది సంగీత హృదయాలు ఆయన లేడనే వార్త తెలిసి మౌనంగా రోదిస్తున్నాయి. ఇక నువ్వు రావా.. నీ పాట మేం వినలేమా అంటూ కన్నీరు కారుస్తున్నారు. గత 44 రోజులుగా చెన్నై ఎంజిఎంలో చికిత్స పొందుతున్న ఈ లెజెండరీ గాయకుడు సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1.04 నిమిషాలకు మరణించాడు. బాలు మరణవార్త తెలిసిన వెంటనే యావత్ భారతీయ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనయింది. రాజకీయ ప్రముఖులు కూడా ఈయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

SP Balasubrahmanyam's health deteriorates further; Singer in extremely critical condition | PINKVILLA

బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. సెప్టెంబర్ 26 ఉదయం 11 గంటలకు ఈయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నైలోని రెడ్ హిల్స్‌లోని తన సొంత ఫామ్ హౌజ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని ఫామ్ హౌజ్‌కు తరలిస్తున్నారు. అక్కడే అభిమానులు, ప్రముఖుల సందర్శనార్థం ఉంచనున్నారు.