special trains resumes soon

తాజాగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు పచ్చా జెండా ఊపింది. దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధం అయింది. ప్రయాణికుల రద్దీ మేరకు త్వరలో మరిన్ని రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేపట్టింది. అన్‌లాక్‌ 4.0 అమలు దృష్ట్యా ప్రత్యేక రైళ్లపై నిర్ణయం తీసుకొనే అధికారాన్ని రైల్వేబోర్డు జోన్‌లకే అప్పగించింది. వివిధ రూట్లలో ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని రైళ్లను నడపాలని సూచించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. దూరప్రాంతాలకు వెళ్లేవారికి ఈ రైళ్ళు ప్రయోజనకరంగా వుంటాయి. ప్రస్తుతం హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి ప్రతిరోజు 22 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా రద్దీ ఉన్న మార్గాల్లో మరో 15 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Also Read: కోవిడ్ కష్ట కాలంలో ప్లాస్మా దానం చేయాలన్న అనసూయ

Indian Railways to resume train services gradually from May 12

కరోనా వైరస్ దృష్ట్యా రెగ్యులర్‌ రైళ్ల స్థానంలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి విపరీతమయిన డిమాండ్ వుంది. తెలుగు రాష్ట్రాల్లో అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభం అయితే ప్రయాణాలకు అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో విపరీతమయిన వత్తిడి ఏర్పడింది. వెయిటింగ్ లిస్ట్ కూడా లేకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. త్వరలో అందుబాటులోకి రాబోయే రిజర్వేషన్‌ బోగీలతోపాటు సాధారణ బోగీల్లోనూ ముందుగా బుకింగ్‌ చేసుకోవలసి ఉంటుంది.

Also Read: దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య !