Telangana Lockdown

Telangana Lockdown : తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. రేపట్నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో లాక్ డౌన్ ప్రారంభం కానుంది. ఈ లాక్ డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ రోజువారీ కార్యకలాపాలకు మినహాయించారు. ఆ తర్వాత పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే, ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ పూర్తిగా లాక్ డౌన్ ఉండనుంది. ఈ మేరకు మంగళవారం సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం ఈ నిర్ణయం తీసుకుంది.

సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంటుందా లేదా అన్న మీమాంస నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పటి వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సహా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా లాక్ డౌన్ పెట్టబోమని తేల్చి చెప్పారు. పలుమార్లు ఇదే విషయం స్పష్టత చేస్తూ వచ్చారు. తాజాగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *