tomato price raise

Prices of tomatoes turn red hot in retail market of Hyderabad

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధర మళ్లీ మోతెక్కిస్తున్నాయి. రెండు రోజుల క్రితం వరకు కిలో రూ. 30 పలికిన ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో వీటి ధర రూ. 50 వరకు పలుకుతోంది. దీంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. వారం క్రితం వరకు గ్రేడ్‌–1 టమాటా కిలో అత్యధికంగా రూ.20 ధర పలకగా.. ఇప్పుడు అమాంతం రూ.50కి పెరిగింది.రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం.. కాయల్లో నాణ్యత తగ్గిపోవడం.. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరుకు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగాయి. దీంతో అసలే లాక్‌డౌన్ దెబ్బతో జీతాలు సరిగా రాక ఇబ్బందులో ఉన్నప్పుడు ఇంత భారీగా ధరలు పెరగడం మింగుడుపనివ్వడం లేదు. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరుకు అందుబాటులో లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.

Also Read: తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ తేదీలు ఇవే..