vips fear on corona virus

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, తమిళనాడు గవర్నర్, కర్ణాటక సీఎం యెడియూరప్ప…ఇలా ఎవరూ కరోనాకు అతీతం కాదని తేలిపోయింది. వీరంతా కరోనా బారినపడి కోలుకుంటున్నారు. ఏపీలో మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఉత్తరప్రదేశ్‌ లో తాజా మంత్రి కరోనా వల్ల కన్నుమూశారు. దీనిని బట్టి కరోనా వల్ల ఎంత ప్రమాదం వుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా వైరస్‌ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నానని, పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వెల్లడించారు. అమిత్ షాకు కరోనా సోకడంతో ఆయనతో సన్నిహితంగా తిరిగినవారు కరోనా టెస్టులు చేయించుకుంటున్నారు. మేదాంత ఆసుపత్రిలోకి ఇతరులు రాకుండా నిషేధం విధించారు. అమిత్‌ షాను ఇటీవలే తాను కలిశానని కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో చెప్పారు. అతి త్వరలో కరోనా టెస్టు చేయించుకుంటానని, అప్పటిదాకా కుటుంబ సభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంటానని తెలిపారు.

Union Home Minister Amit Shah has been tested positive for coronavirus

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనాబారిన పడ్డారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కరోనా రావడంతో హోం ఐసోలేషన్లో చికిత్స అందుకుంటున్నారు. ఎవరికి వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాను నియంత్రించే మందులు ఇంకా అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ వచ్చేవరకూ జాగరూకత అవసరం.