vro system cancel in telangana

తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దుకు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌లకు ఇప్పటికే సీఎస్‌ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా రికార్డులు స్వాధీనం చేసుకోవాలన్నారు. సాయంత్రం 5 గంటల వరకు రిపోర్ట్‌ పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 12 గంటలలోగా రికార్డులను కలెక్టరేట్‌లో అప్పగించాలని వీఆర్వోలకు స్పష్టంచేసింది. రికార్డుల సేకరణ ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తికావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ల నుంచి సాయంత్రంలోగా సమగ్ర నివేదిక రావాలని ఆదేశించారు.

Also Read: ఏపీ అన్‌లాక్‌ 4.0 కొత్త మార్గదర్శకాలు

KCR takes a break from Covid and turns to farming

రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ఏ పని జరగాలన్నా వీఆర్వో కీలక పాత్ర ఉంటుంది. 95 రకాల విధులు వీఆర్వో నిర్వర్తిస్తుంటారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు కూడా వీఆర్వో దగ్గరుండి చూడాలి. గ్రామస్థులు దగ్గరుండి మరీ వీఆర్వో పనిచేస్తారు వీఆర్వో సంతకం చేస్తేనే సర్టిఫికెట్లు జారీ అవుతాయి. అయితే ఈ పనులు చేసేందుకు వీఆర్వోలు లంచాలకు అలవాటు పడుతున్నారు. వారి జీతాల కంటే ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఆ వ్యవస్థను రద్దు చేసి వ్యవస్థ పేరు కూడా మార్చాలని భావిస్తున్నారు. కొత్తగా అదనపు బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7172 మంది వీఆర్వో పోస్టులు ఉండగా.. అందులో ఐదువేలమంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి.