ys jagan aerial survey

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రి పేర్ని నాని ఉన్నారు.సీఎం జగన్ ఏరియల్ సర్వేలో మనసు కలిచివేసే విజువల్స్ కనిపించాయి. పంటపొలాలన్నీ నీట మునిగిపోయాయి. లోతట్టు గ్రామాలన్నీ జల దిగ్బంధంతో చిక్కుకుపోయాయి. ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. కాగా, గోదావరి జిల్లాలో పరిస్థితులు చూసి చలించిపోయిన సీఎం జగన్.. ముంపు బాధితుల కుటుంబాలకు ఒక్కొంటికి రూ.2 వేల చొప్పున సహాయం అందించాలని ఆదేశించారు. ముంపు బాధితుల పట్ల మానవత్వంతో, ఉదారంగా వ్యవహరించాలని కోరారు. మన ఇంట్లో సమస్యగానే భావించి వారికి అండగా నిలవాలని.. ఖర్చు విషయంలో రాజీ పడొద్దన్నారు.