nagulachaviti festival

కార్తీక మాసంలో దీపావళి పండుగ ముగిసిన నాలుగు రోజుల తర్వాత శుద్ధ చతుర్దశి రోజున నాగులచవితి పండుగ వస్తుంది. ఈ సమయంలో మన దేశంలోని చాలా దేవాలయాల్లో నాగేంద్రులకు భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఈ నాగులచవితి రోజున చాలా మంది మహిళలు ‘నాగుపాము’ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. అలాగే చాలా మంది పాములపుట్టలో పాలు పోసేందుకు వెళ్లటాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇలా పుట్టలో పాలు ఎందుకు పోస్తారు.. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం…

Festivals in Maharashtra: Nag Panchami-Maharashtra-www.vishvabhraman.com

  • నాగులచవితి రోజున పాములను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులు విశ్వసిస్తారు.
  • కుజదోషానికి, కాలసర్పదోషానికి అధిపతి సుబ్రహ్మణ్యస్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజలు చేసి, పాలు నైవేద్యంగా ఇస్తే వైవాహిక దాంపత్య సమస్యలు, గర్భదోషాలు తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారని భక్తుల నమ్మకం.
  • ఈ నాగుల చవితి పండుగను మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోమాదిరిగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో నాగులచవితి పండుగను తెల్లవారుజాము నుండే జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు కార్తీక శుద్ధ చతుర్దినాడు ఈ పండుగను జరుపుకుంటే, మరికొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు ఈ పండుగను జరుపుకుంటారు.
  • ఈ పాములు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూసారాన్ని కూడా కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి ‘నీటిని’ ప్రసాదించే దేవతలుగా భావిస్తారు. అంతేకాదు ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ, పరోక్షంగా అన్నదాతలకు నష్టం కలగకుండా చేస్తాయట! ఇలా మనకు ఇవి ఎంతగానో సహాయపడుతుంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *