Hanuman Jayanti

Hanuman Jayanti  : ఎక్కడెక్కడ రామనామము వినబడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని భక్తుల నమ్మకం. రామ భక్త పరాయణుడు, బహుపరాక్రమశాలి, ఘోటక బ్రహ్మచారి శ్రీ ఆంజనేయుడి జన్మదినాన్ని “హనుమాన్ జయంతి”గా ఉత్సవాలు చేసుకొంటారు. భారతీయ హిందువులే కాకుండా నేపాల్ లాంటి విదేశాల్లో కూడా విరివిగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతి ఏడాదికి రెండు సార్లు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మొదటి మాసమైన “చైత్ర” మాసం “పౌర్ణమి” నాడు“హనుమాన్ జయంతి”ని జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని కొందరు చైత్ర మాసం పౌర్ణమి నాడు చేస్తుండగా మరికొందరు వైశాఖ దశమి నాడు జరుపుకోవటం గమనార్హం. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మూల నక్షత్రంలో జరుపుకుంటే.. . మహారాష్ట్రలో చంద్రమాన పంచాంగం ప్రకారం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకొంటారు. ఇక తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లో హనుమజ్జయంతి ని వైశాఖమాసం కృష్ణపక్ష దశమి నాడు జరుపుకుంటారు.కొందరు హనుమాన్ భక్తులు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్లలో 41 రోజుల దీక్షను చైత్రమాసం పౌర్ణమి నాడు ప్రారంభించి వైశాఖమాసం కృష్ణపక్షం 10రోజున ముగిస్తారు.

Hanuman Jayanti hanuman janmotsav 2021 chaitra purnima 2021 on 27 april  shubh muhurat puja vidhi and mantra in hindi: Hanuman Jayanti 2021: हनुमान  जयंती आज, जानें शुभ मुहूर्त, मंत्र और पूजा विधि -
హనుమజ్జయంతి పూజా విధానం:

హనుమజ్జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకుపూజ చేయడం వల్ల సర్వత్ర జయము కలుగును. 5 సంఖ్య హనుమంతునికి చాల ప్రీతి కరమైనది కావునా హనుమాన్ మందిరమునకు 5 ప్రదక్షిణలు చేయడం ఉత్తమం. ఆలయాల్లో లభించే సింధూరం నుదుటన ధరించడం, ప్రసాదం స్వీకరించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగును. హనుమాన్ చాలీసా పారాయణం చేసి అరటి పళ్ళు , మామిడి పళ్ళు నైవేద్యం పెట్టుట వల్ల స్వామి యొక్క అనుగ్రహం కలుగును. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు గల మండలం రోజుల పాటు ప్రతిరోజూ 1, 3, 5, 11, లేదా 41 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితం కలుగును. మండలం రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ప్రతి నిత్యం అరటిపండు నివేదించి, ఆ పండును ప్రసాదంగా తీసుకొన్నచో సంతానం తప్పకుండ కలుగుతుందని భక్తుల నమ్మకం. హనుమజ్జయంతి రోజున సింధూర వర్ణ వస్త్రములు ధరించడం, రామాలయాన్ని దర్శించుకోవడం వల్ల సర్వ శుభాలు కలుగును. హనుమంతుడి ఆరాధన వల్ల ఫలితములు: శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని విశ్వాసం.జాతకరీత్యా శని గ్రహ దోషంతో బాధపడుతున్న వారు హనుమంతుడిని పూజించుట చేత గ్రహశాంతి ని పొందెదరు.ఆంజనేయ ఆరాధన వల్ల ఆయుష్షు, ఆరోగ్యం ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని నమ్మకం. నిదురించుటకు ముందు, ప్రయాణమునకు ముందు ఆంజనేయుడిని స్మరించినవారికి మృత్యుభయం తొలగుటతో పాటుగా సర్వత్ర విజయం లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *