about divi vadthya in bigg boss telugu

దివి వద్యాది విద్యాధికుల కుటుంబం నుంచి వచ్చారు. తల్లి, సోదరుడు ఇద్దరు వైద్యులే. కానీ దివి మాత్రం రూట్ మార్చి ఎంటర్‌టైన్‌మెంట్ పట్టాలెక్కారు. ఎంటెక్ పూర్తి చేసిన దివి సాఫ్ట్‌వేర్.. మరో ఫీల్డ్‌ను ఎంచుకోకుండా యాక్టింగ్‌పై దృష్టిపెట్టారు. పాకెట్ మనీ కోసం మొదట్లో మోడలింగ్ చేశారు. మోడలింగ్ చేస్తుండగానే మహేష్ బాబుతో మొదటి చిత్రంలో నటించే అవకాశం దక్కింది. మహర్షి చిత్రంలో నటించడం ద్వారా దివి మరింత గుర్తింపు పొందారు.దివి వద్యా పక్కా హైదరాబాదీ. భాగ్య నగరంలోనే పుట్టి పెరిగిన దివి విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసుకొన్నారు. హైదరాబాద్‌ సంస్కృతి, సంప్రదాయలు అంటే ఇష్టం. ఆమెకు సంబంధించిన అభిరుచులు ఏంటో ఆమె ఇన్స్‌టాగ్రామ్ పేజ్ చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. అర్బన్ కల్చర్‌తోపాటు ట్రెడిషినల్ లుక్స్‌తో ఆకట్టుకొనే అందం దివి సొంతం కావడం గమనార్హం.

Also Read: సుజాతపై ఫైర్ అయిన కరాటే కళ్యాణి…

అందం, అభినయంతోపాటు ఉన్నత విద్యను అభ్యసించిన దివి వద్యా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లోకి 14వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టారు. అక్కినేని నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి చిత్రంలోని రూమ్ నంబర్ అనే పాటతో బిగ్‌బాస్ వేదికను మాస్, మసాల స్టెప్పులతో అదరగొట్టింది. ఆ విధంగా హోస్ట్ నాగార్జున పరిచయం చేసిన దివి వేదికపై మాటల్తో కూడా ఆకట్టుకొన్నారు. ఇలా తళుక్కున మెరిసిన దివి గురించి గూగుల్, సోషల్ మీడియాలో తెగ వెతుకుతున్నారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.