bigg boss 4 latest promo

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇప్పుడిప్పుడే ఎంటర్‌టైన్మెంట్ పట్టాలెక్కుతోంది. ఇంటి సభ్యుల మధ్య స్నేహం, అప్యాయతలు, ప్రేమలతో టాస్క్‌లతో రసవత్తరంగా మారుతోంది. 16 మంది ఉన్న బిగ్ బాస్ హౌస్‌లో నలుగురు అందమైన అమ్మాయిలు ఉన్నారు. వారే అరియానా గ్లోరీ, దివి, హారిక, మోనాల్..! వీరిలో మోనాల్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందరితో కలివిడిగా ఉండే మోనాల్ గజ్జర్.. అఖిల్, అభిజీత్‌తో మాత్రం చాలా క్లోజ్‌గా మూవ్ అవుతోంది. వారిద్దరు కూడా మోనాల్ చుట్టూ తిరుగుతూ ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

హౌస్‌లో మోనాల్ గజ్జర్, అఖిల్, అభిజీత్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇవాళ్టి ప్రోమోలో కూడా వీరినే హైలైట్ చేశారు. సాధారణంగా మనం మిత్రులని, భాగస్వామిని సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ వాతావరణంలో అలాంటివి సాధ్యం కాదని అభిజీత్‌తో మోనాల్ చెబుతుంటే.. వారు ఏం మాట్లాడుకుంటున్నారని చాటుగా వింటున్నాడు అఖిల్. అలా డిస్కషన్ మధ్య మోనాల్ గజ్జర్ దగ్గుతుంది. వెంటనే అభిజీత్ నీళ్లు తెచ్చేందుకు వాటర్ ఫిల్టర్ దగ్గరకు వెళ్తాడు. అప్పటికే అక్కడికి వెళ్లిన అఖిల్.. నీళ్లు తీసుకొని మోనాల్‌కు ఇస్తాడు. ‘హో.. ఇస్తున్నావా..’అని అభిజీత్ అడిగితే, ఏమీ మాట్లాడుకుండా వెళ్లిపోతాడు అఖిల్.