bigg boss 4 telugu episode

గత నాలుగు రోజులు బిగ్ బాస్ హౌస్‌లో మౌన ప్రదర్శన చేస్తుందో ఏమో తెలియదు కాని.. పొరపాటున కూడా ఒక్క మాట మాట్లాడినట్టు కనిపించలేదు దివి . బిగ్ బాస్ హౌస్‌లో 14వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నటి దివి .. ఎంట్రీ సాంగ్‌తో అదరగొట్టింది. తన నాజూకు అందాలతో కుర్రకారుకి మంచి కిక్ ఇచ్చింది. పలు వెబ్ సిరీస్‌తో పాటు మమర్షి సినిమాలో మెరిసిన దివి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. అయితే పరిచయం లేకపోయిన తన పెర్ఫామెన్స్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువఅవుతానని బిగ్ బాస్ స్టేజ్‌పై చెప్పిన దివి.. హౌస్‌లోకి వచ్చిన తరువాత ఆమెకు సింగిల్ డైలాగ్ కూడా లేదు.తాజాగా గురువారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో దివి మాట్లాడితే ఎలా ఉంటుందో శాంపిల్ చూపించింది. బిగ్ బాస్.. మిగతా సభ్యుల బిహేవియర్‌పై మాట్లాడాలనే టాస్క్ ఇచ్చారో ఏమో కాని.. ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఈ సీజన్ 4 పాతాళగంగ మోనాల్ గజ్జర్ గురించి చెప్తూ.. మోనాల్ మీరు ఏదైనా విషయం వస్తే ఊరికే ఏడ్చేస్తున్నారు.. మీరు నిజంగా బాధ కలిగి ఏడ్చినా అప్పుడు ఎవరూ పట్టించుకోరని ప్రేక్షకులకు కలిగిన అభిప్రాయాన్నే దివి కుండబద్దలు కొట్టి చెప్పింది.