gangavva

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో గంగ‌వ్వ స్థానం ప్ర‌త్యేక‌మైన‌ది. షో ప్రారంభ‌మైన కొత్త‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ర్షించేందుకు ప్ర‌ధానంగా ఆమె పైనే ప్రోమోలు వ‌చ్చేవి. ఆమె హుషారు, ఆమె వేసే పంచులు షో నీర‌సంగా సాగ‌కుండా, ఫుల్ జోష్‌తో కొన‌సాగేందుకు కార‌ణ‌మ‌య్యేవి. అయితే ఆమ‌ధ్య త‌న ఆరోగ్యం బాగోలేద‌ని, ఇంటికి వెళ్లిపోతాన‌ని చేతులెత్తి వేడుకుంది. కానీ బిగ్‌బాస్ ఆమెను పంపించేందుకు సుముఖత వ్య‌క్తం చేయ‌లేదు. అందుకు బ‌దులుగా ఆమెకు వైద్యం చేయించి మ‌రికొన్ని రోజులు ఇంట్లోనే ఉంచేందుకు ప్ర‌య‌త్నించారు. ఆమె తిరిగి కోలుకొని ఎప్ప‌టిలాగే హుషారుగా క‌నిపించ‌డంతో ఇప్ప‌ట్లో అవ్వ బ‌య‌ట‌కు వెళ్ల‌ద‌ని అంద‌రూ డిసైడ్ అయ్యారు.

Bigg Boss Telugu 4: Gangavva emotionally shares her concern with Bigg Boss;  says she can't stay locked up in the house anymore - Times of India

కానీ నిన్న‌టి ఎపిసోడ్‌లో ఆమెకు మ‌ళ్లీ ఇంటిపై ప్రాణం కొట్టుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండ‌లేక‌పోతున్నాన‌ని వాపోయింది. క‌డుపు నిండా తినే త‌న‌కు ఇక్క‌డ పిడికెడు ముద్ద కూడా లోప‌లికి వెళ్ల‌ట్లేద‌ని భోరుమ‌ని ఏడిచింది. కానీ బిగ్‌బాస్ ఈసారి ఆమె వేద‌న‌ను అర్థం చేసుకోకుండా క‌ఠినంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. అవ్వ మొర‌ను ఆల‌కించి ఆమెను బిగ్‌బాస్ హౌస్‌లో నుంచి బ‌య‌ట‌కు పంపించేసిన‌ట్లు స‌మాచారం. అనారోగ్య కార‌ణాల వ‌ల్లే ఆమెను షో నుంచి త‌ప్పించిన‌ట్లు తెలుస్తోంది.