IB Recruitment 2021

IB Recruitment 2021: ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో రెండువేల అసిస్టెంట్‌ సెంట్రల్‌ ంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ఏసీఐఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టుల ఎంపిక విధానం, అర్హతలు తదితరాలపై సంక్షిప్తంగా..

మొత్తం పోస్టులు: 2000
పోస్టు: అసిస్టెంట్‌ సెంట్రల్‌
ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ (ఏసీఐఓ)- గ్రేడ్‌-2
కేటగిరీలవారీగా ఖాళీలు:
జనరల్‌-989, ఈడబ్ల్యూఎస్‌-113, ఓబీసీ- 417, ఎస్సీ-360, ఎస్టీ-121
జీతభత్యాలు: లెవల్‌-7 పే కమిషన్‌ కింద నెలకు రూ.44,900-1,42,400/- జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఉంటాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి.
18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, డిపార్ట్‌మెంటల్‌ ఉద్యోగులు, క్రీడాకారులకు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
పదోన్నతులు: గ్రేడ్‌-2 ఏసీఐఓలుగా జాబ్‌లో జాయిన్‌ అయిన తర్వాత ఐదేండ్లలోపు గ్రేడ్‌-1 తర్వాత డీసీఐఓ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌, జాయింట్‌
డిప్యూటీ డైరెక్టర్‌ వంటి ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంది.

ఎంపిక విధానం

మూడు దశలు ఉంటాయి. టైర్‌-1, 2, 3
టైర్‌-1: దీన్ని ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తారు. దీనిలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు.
దీనిలో జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, న్యూమరికల్‌/ అనలిటికల్‌/ లాజికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌, ఇంగ్లిష్‌, జనరల్‌ స్టడీస్‌ సబ్జెక్టుల  నుంచి 20 ప్రశ్నల చొప్పున అడుగుతారు.
ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు.
పరీక్షా సమయం 60 నిమిషాలు.
టైర్‌-3: ఇది 100 మార్కులకు
నిర్వహించే ఇంటర్వ్యూ దీనిలో అర్హత సాధించినవారికి చివరగా వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
రాష్ట్రంలో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *