types of covid 19 tests

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా వ్యాప్తిని తగ్గించాలంటే, వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయడం చాలా అవసరం. దేశంలో కరోనా కేసులు 20 లక్షలు దాటిపోయిన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వైరస్ వచ్చి దాదాపు ఐదు నెలలు దాటింది. దేశ వ్యాప్తంగా రోజువారీగా 60వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నియమాలను పెద్దగా పాటించడం లేదు. ఏదో మొక్కుబడిగా మాస్కులు ధరిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తికి ఇదీ ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్-19 కి  ఎలాంటి పరీక్షలు చేస్తారన్నదానిపైనా ప్రజలు అవగాహన పెంచుకుంటే మంచిది. కోవిడ్ నిర్దారణకు ఎలాంటి టెస్టులు చేస్తారో చూద్దాం.

RT-PCR టెస్ట్

దీన్ని రియల్‌ టైమ్‌ పాలిమరైజ్‌ చైన్‌ రియాక్షన్‌ అంటారు. ఈ పరీక్షని మీ ముక్కు లేదా గొంతులోని స్వాబ్ తీసి పరీక్షిస్తారు. ఫలితం రావడానికి 2-3 రోజులు పడుతుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100శాతం పాజిటివ్ అనే అర్ధం. నెగిటివ్ వస్తే 99శాతం నెగిటివ్ అని అర్ధం.  వైరస్‌ నిర్ధారణలో ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ పద్ధతిగా గుర్తిస్తున్నారు. మనదేశంలో ఎక్కువగా చేస్తున్న కోవిడ్ పరీక్షలు ఇవి.

Coronavirus testing is ramping up. Here are the new tests and how they  work. | Live Science

ర్యాపిడ్ ఆంటిజెన్ టెస్ట్

ఈ పరీక్ష కూడా స్వాబ్ ద్వారానే పరీక్షిస్తారు. కానీ ఫలితం 15 నిమిషాల్లో తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ వస్తే 100శాతం పాజిటివ్ అనే అర్ధం . నెగిటివ్ వచ్చి, కోవిడ్ లక్షణాలు తగ్గకపోతే తప్పకుండా RT-PCR టెస్ట్ చేయించుకోవాలి.

J&K introduces rapid antigen COVID-19 tests for screening of travellers

ట్రూనాట్ పరీక్ష

ఈ టెస్టు RT-PCR మాదిరిగానే పనిచేస్తుంది. అలాగే వేగంగా ఫలితాలను ఇస్తుంది. కోవిడ్ -19 కోసం స్క్రీనింగ్ మరియు నిర్ధారణ కోసం ఈ పరీక్ష చేస్తారు. ఇది కూడా నోరు, ముక్కు లోని స్వాబ్ ద్వారా వైరస్ కనుగొనాల్సి ఉంటుంది.

COVID-19 testing: How antibody, antigen, RT-PCR, TrueNat tests differ,  their strengths and limitations - Health News , Firstpost

HRCT-LUNGS (సిటి స్కాన్ )

యాంటిజెన్ పరీక్షలో నెగిటివ్ వచ్చినప్పటికీ Hrct-chest లో పాజిటివ్ వచ్చిన కేసులు చాలా వున్నాయి. HRCT లో ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఎంత వుంది స్కోరింగ్ కూడా రిపోర్ట్ లో వస్తుంది ఇది కూడా ముఖ్యమైన పరీక్ష. ఇది తీవ్రమయిన లక్షణాలున్నవారికి చేస్తారు.

The Radiology Assistant : COVID-19 Imaging findings

యాంటిబాడీ టెస్ట్

ఈ పరీక్షని రోగి రక్త నమూనాలను సేకరించి చేయడం జరుగుతుంది. ఫలితం ఒక రోజు లోపే వస్తుంది. దీని ద్వారా వచ్చే ఫలితం సరి అయింది కాదు. కావున  క్రియాశీల COVID ని నిర్ధారించడానికి యాంటీబాడీ పరీక్షను ఎంచుకోవడం మంచిదికాదు.

What Do COVID-19 Antibody Tests Show — and Can the Results Be Trusted? |  Discover Magazine